News April 19, 2025

ఔరంగజేబు క్రూరుడని నెహ్రూయే అన్నారు: రాజ్‌నాథ్ సింగ్

image

మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ వంటివాళ్లు దేశానికి ఆదర్శం కానీ ఔరంగజేబులాంటివారు కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘శౌర్యానికి, దేశభక్తికి మహారాణా ప్రతాప్ ఓ ప్రతీక. ఆయన్నుంచి స్ఫూర్తి పొంది శివాజీ మొఘలులపై పోరాడారు. ఔరంగజేబు పరమ క్రూరుడని నెహ్రూయే స్వయంగా అన్నారన్న విషయం అందరూ తెలుసుకోవాలి. రాణా, శివాజీ ఇద్దరూ మొఘలులకు మాత్రమే వ్యతిరేకం. ముస్లింలకు కాదు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 20, 2025

IPL: టాస్ గెలిచిన RCB

image

ముల్లాన్‌పూర్‌లో PBKSvsRCB మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొన్న తమ సొంత గ్రౌండ్‌లో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో RCB ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా ఉండొచ్చు.

PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, అయ్యర్, ఇంగ్లిస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, బార్ట్లెట్, అర్షదీప్, చాహల్
RCB: సాల్ట్, కోహ్లీ, పటీదార్, రొమారియో, జితేశ్, డేవిడ్, క్రునాల్, భువీ, హేజిల్‌వుడ్, దయాళ్, సుయాశ్

News April 20, 2025

విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

image

బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News April 20, 2025

వర్షం మొదలైంది..

image

TG: హైదరాబాద్ శివారు ప్రాంతాలైన మేడ్చల్, తుర్కపల్లి, శామీర్‌పేట, ఆలియాబాద్, తూముకుంట, కీసరలో వర్షం పడుతోంది. రాబోయే గంట నుంచి రెండు గంటల్లో HYDతో పాటు నాగర్ కర్నూల్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

error: Content is protected !!