News December 15, 2024
నెహ్రూ మోడల్ విఫలమైంది.. సరిచేస్తున్నాం: జైశంకర్

దేశాభివృద్ధి విషయంలో నెహ్రూ మోడల్ విఫలమైందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ‘నెహ్రూ అభివృద్ధి మోడల్ నుంచి నెహ్రూ విదేశాంగ విధానం పుట్టుకొచ్చింది. దాన్ని ఇప్పుడిప్పుడే సంస్కరిస్తున్నాం. రష్యా, చైనా సైతం అప్పటి తమ భావజాలాల్ని నేడు వ్యతిరేకిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం నేటికీ కొన్ని వర్గాలు వాటిని కొనసాగిస్తున్నాయి. 2014 తర్వాతి నుంచి అన్నీ సరిచేస్తున్నాం’ అని వివరించారు.
Similar News
News December 22, 2025
నోటి పూత ఎలా తగ్గించాలంటే?

విటమిన్ లోపం, వాతావరణ మార్పుల వల్ల నోటి పూత వేధిస్తుంది. ఇది సాధారణంగా 2వారాల్లో తగ్గిపోతుంది. సమస్య ఎక్కువైతే తేనె, కొబ్బరి, పాల పదార్థాలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఉప్పునీటిని పుక్కిలించడం, తులసి ఆకులు నమలడం, చల్లటి నీటితో నోరు శుభ్రం చేసుకోవడం, లవంగం నమలడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. వీటితోపాటు విటమిన్ లోపాన్ని నివారించడానికి వైద్యులను సంప్రదించి మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.
News December 22, 2025
మీకు తెలుసా?.. ఆ ఊరిలో ఒక్కరే ఉంటారు!

ఒక ఊరికి ఒక్కరే రాజు, ఒక్కరే బంటు అంటే వినడానికి వింతగా ఉన్నా.. అమెరికాలోని ‘మోనోవి’లో ఇదే జరుగుతోంది. 89 ఏళ్ల ఎల్సీ ఐలర్ ఆ ఊరిలో ఏకైక నివాసి. ఏటా తనకు తానే ఓటు వేసుకుని మేయర్గా గెలుస్తారు. సెక్రటరీగా సంతకాలు చేస్తూ, తన హోటల్ కోసం తానే లైసెన్సులు ఇచ్చుకుంటారు. ఊరి మనుగడ కోసం పన్నులు చెల్లిస్తుంటారు. భర్త జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ, ఒక హోటల్ నడుపుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
News December 22, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో టెక్నీషియన్ పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


