News December 14, 2024
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు నెహ్రూ యత్నించారు: పీఎం మోదీ

రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు కాంగ్రెస్ అనేక విధాలుగా ప్రయత్నించిందని PM మోదీ పార్లమెంటు ప్రసంగంలో మండిపడ్డారు. ‘రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు నాటి ప్రధాని నెహ్రూ అనేకసార్లు ప్రయత్నించారు. రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. తప్పు చేస్తున్నారంటూ బాబూ రాజేంద్రప్రసాద్ ఆయన్ను హెచ్చరించారు. ఎంతోమంది పెద్దలు సైతం సలహా ఇచ్చినా నెహ్రూ పెడచెవిన పెట్టారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 13, 2025
షమీపై లక్నో, ఢిల్లీ ఆసక్తి

SRH స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని దక్కించుకునేందుకు లక్నో, ఢిల్లీ ఆసక్తిగా ఉన్నాయని Cricbuzz తెలిపింది. నవంబర్ 15తో రిటెన్షన్ డెడ్లైన్ ముగియనుండగా SRH షమీని వదులుకోవచ్చని పేర్కొంది. గత వేలంలో హైదరాబాద్ రూ.10 కోట్లకు షమీని కొనుగోలు చేసింది. కానీ అతడు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశారు. గత వేలంలో షమీ కోసం లక్నో రూ.8.5 కోట్ల వరకు వెళ్లింది. అటు ఢిల్లీ యాజమాన్యంలో భాగమైన గంగూలీ షమీపై ప్రశంసలు కురిపించారు.
News November 13, 2025
తిరుమల: ఘంటా మండపం విశిష్టత ఏంటంటే..?

తిరుమల సోపాన మార్గంలోని అవ్వాచారి కోనకు దగ్గరగా ఉండే ఘంటా మండపం శ్రీవారి నైవేద్య సమయాన్ని సూచిస్తుంది. 1630 ప్రాంతంలో వెంకటగిరి రాజు రఘునాథ యాచమ నాయకులు ఈ ఘంటను చంద్రగిరి రాజు రామదేవరాయలకు బహూకరించారు. తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెట్టేటప్పుడు మోగే గంటల ధ్వని ఈ మండపంలోని గంటలను తాకగానే, అవి మోగేవి. ఈ శబ్దం వినిపించాకే చంద్రగిరిలోని రాజు భోజనం చేసేవారని ప్రతీతి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 13, 2025
ఫ్రీ బస్సు.. ఆర్టీసీకి రూ.400 కోట్ల చెల్లింపు

AP: స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్కీమ్ ప్రారంభించిన ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు ఫ్రీ టికెట్లకు అయిన ఖర్చు రూ.400 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. దీనిపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదని పేర్కొన్నాయి. కనీసం 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, 10వేల మంది సిబ్బందిని నియమించాలని కోరాయి.


