News November 16, 2024
కాపురంలో చిచ్చు రేపిన నెహ్రూ కానుక!

బరోడా మహారాణి కోసం నెహ్రూ ఆర్డర్ చేసిన 1951 మోడల్ రోల్స్ రాయిస్ కారు ఓ కాపురంలో చిచ్చు రేపింది. ప్రస్తుతం దాని విలువ రూ.2.5కోట్లుగా ఉంది. అయితే తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఈ కారును కట్నంగా ఇవ్వాలని తన భర్త వేధిస్తున్నట్లు ఓ మహిళ గ్వాలియర్ కోర్టు, ఆపై సుప్రీంను ఆశ్రయించారు. తమది నిజమైన పెళ్లి కాదని, గ్రహదోషం కోసం తనను ఆమె పెళ్లి చేసుకున్నట్లు భర్త చెప్పారు. కట్నంగా కారు అడగలేదని తెలిపారు.
Similar News
News October 24, 2025
జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలుసా?

సుప్రీంకోర్టు తదుపరి <<18083662>>సీజేఐ<<>> రేసులో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 1962లో హరియాణాలోని హిసార్‌లో జన్మించారు. 1984లో లా డిగ్రీ అందుకున్న ఆయన 2000లో హరియాణా AGగా, 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్‌ప్రదేశ్ HC ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. ఒకవేళ ఆయన CJI నియమితులైతే నవంబర్ 24న బాధ్యతలు చేపట్టి 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు.
News October 24, 2025
ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
News October 24, 2025
ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్‌ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.