News March 17, 2024

నెల్లూరు: ఎన్నికల ఫిర్యాదుల సహాయం కేంద్రం ఏర్పాటు

image

ఎన్నికల పక్రియ పై ఫిర్యాదు, సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణ తెలిపారు. 2024 ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 8 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ల సౌకర్యార్థం కోసం హెల్ప్ లైన్ 1950 తోపాటు 0861- 2349402, 2349403, 2349404 ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు.

Similar News

News February 1, 2026

నెల్లూరు: నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ​జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 20,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

News February 1, 2026

స్వచ్ఛరథం ఆపరేటర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను స్వచ్ఛ రథం ద్వారా సేకరించనున్నారని వీటి ఆపరేటర్ల ఎంపికకు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని డీపీఓ వసుమతి తెలిపారు. అల్లూరు, అనంత సాగరం, ఏఎస్పేట, కొడవలూరు, బుచ్చి, నెల్లూరు రూరల్, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వెంకటగిరి, వాకాడు, ఓజిలి, విడవలూరు, సీతారామపురం, కలువాయి, దగదర్తి, దుత్తలూరు పలు మండలాల్లో స్వచ్ఛ రథం కార్యక్రమం అమలు చేయనున్నామన్నారు.

News February 1, 2026

నేడే కేంద్ర బడ్జెట్.. నెల్లూరు జిల్లాకు నిధులు వచ్చేనా.?

image

పట్టణాల్లో మురుగు నీటి నెట్‌వర్క్‌, నీటి సరఫరా బలోపేతం కోసం కేంద్ర ‘అమృత్’ పథకం జిల్లాలో నిధుల లేమితో నత్తనడకన సాగుతోంది. నెల్లూరులో storm water drainageకు ₹82 కోట్లు అవసరం కాగా ₹19 కోట్లు కేటాయించారు. కావలిలో మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్లాంటకు రూ. 3 కోట్లు, వాటర్ సప్లై స్కీంకు ₹10 కోట్ల అవసరం. బుచ్చి వాటర్ స్కీంకు ₹71 కోట్లు అవసరం కాగా ₹25 కోట్లు కేటాయించారు. వీటికి కేంద్ర నిధులు కేటాయించేనా.?