News March 18, 2024

నెల్లూరు: నేటి పోలీస్ స్పందన రద్దు

image

ప్రతి సోమవారం నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు విషయాన్ని గుర్తించి.. సహకరించాలని కోరారు.

Similar News

News October 31, 2024

నెల్లూరు: 1న నిరుద్యోగులకు మెగా జాబ్ మేళా

image

నెల్లూరు జిల్లా ఉపాధి కార్యాలయం, జిల్లా స్కిల్ డెవలప్మెంట్, సిడాప్ సంయుక్తంగా నవంబరు 1న ఉదయం 10.30 గంటలకు మైపాడు గేట్ సమీపంలోని న్యాక్ సెంటర్ నందు మెగా జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు 18 – 25 ఏళ్ల లోపు ఉండి, ఐటి/ఇంటర్/ డిగ్రీ/డిప్లొమా విద్యార్హతలు కలిగి ఉండాలన్నారు.

News October 31, 2024

నెల్లూరు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: ఎస్పీ

image

నెల్లూరు జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ కృష్ణ కాంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి అందరి జీవితాల్లో మరిన్ని కాంతులు నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ దీపావళి అన్నారు. కాలుష్యరహిత టపాసులను కాల్చాలని సూచించారు.

News October 30, 2024

పొదలకూరు: రావి ఆకుపై దీపావళి వేడుక చిత్రం

image

దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళి వేడుక చిత్రాన్ని రావి ఆకుపై ఓ కళాకారుడు రూపొందించారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య ఈ చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. కాగా ఇదివరకు ఆయన రావి ఆకుపై చాలా చిత్రాలను గీశారు.