News February 22, 2025
రూ.10వేల కోట్లిచ్చినా NEP అమలు చేయం: స్టాలిన్

కేంద్రం రూ.10వేల కోట్లు ఇచ్చినా ‘జాతీయ విద్యా విధానాన్ని’ అమలు చేసేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. NEPని అమలు చేస్తే రాష్ట్రం 2వేల ఏళ్ల నాటి చారిత్రక యుగం నాటికి వెళుతుందని ఆరోపించారు. కామర్స్, ఆర్ట్స్ వంటి కోర్సులకు నీట్ మాదిరి ప్రవేశపరీక్ష ఉండటం ఏంటని ప్రశ్నించారు. హిందీ భాషకు తాము వ్యతిరేకం కాదని, అయితే బలవంతంగా రుద్దటాన్నిఅంగీకరించేది లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.
Similar News
News November 11, 2025
అయ్యప్ప దీక్షా నియమాలు (1/2)

☞ దీక్షలో ఎల్లప్పుడూ మాల ధరించే ఉండాలి.
☞ ఎప్పుడూ నల్లని దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించాలి.
☞ విభూతి, చందనం, కుంకుమ ధరించాలి.
☞ పూజ, భిక్ష సమయాల్లో చొక్కా ధరించకూడదు.
☞ కఠిన బ్రహ్మచర్యం పాటించాలి.
☞ నేలమీద నిద్రపోవాలి. మంచంపై కూర్చోరాదు.
☞ క్షురకర్మ చేయించుకోరాదు. గోళ్లు తీయకూడదు.
☞ కోపాన్ని వీడాలి. అబద్ధాలకూడదు. ☞ పాదరక్షలు ధరించరాదు. <<-se>>#AyyappaMala<<>>
News November 11, 2025
పొద్దుతిరుగుడు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

పొద్దుతిరుగుడు పంట కోత సమయాన్ని కొన్ని సూచనల ద్వారా మనం గుర్తించవచ్చు. పొద్దుతిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మ పచ్చ రంగులోకి మారితే ఆ పంట కోతకు వచ్చినట్లు. అప్పుడు కోత యంత్రం చేత లేదా కూలీల సాయంతో పంటను కోయాలి. కోత అనంతరం పువ్వులను 2-3 రోజులు ఆరనివ్వాలి. తర్వాత కర్రలతో కొట్టి గాని, ట్రాక్టర్తో నడిపి నూర్పిడి చేసి గింజను వేరుచేసుకోవచ్చు. గింజల్లో తేమ 9 నుంచి 10 శాతం వచ్చేవరకు ఎండబెట్టాలి.
News November 11, 2025
మహాత్మాగాంధీ వర్సిటీలో ఉద్యోగాలు

కేరళలోని <


