News September 10, 2025
నేపాల్ రాజ్యాంగాన్ని మార్చాలి: నిరసనకారులు

నేపాల్‌లో జెన్-Z యువత నిరసనలు కొనసాగిస్తోంది. తాజాగా వారి నుంచి మరిన్ని <<17651342>>డిమాండ్లు<<>> వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చాలని, దేశంలో 30 ఏళ్ల దోపిడీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తించి, పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. దేశ భవిష్యత్తు కోసమే ఈ ఉద్యమమని చెబుతున్నారు. కొత్త రాజకీయ వ్యవస్థ వస్తేనే శాంతి స్థాపన జరుగుతుందని అంటున్నారు.
Similar News
News March 12, 2026
భారత్‌పై మళ్లీ టారిఫ్స్.. రెడీ అవుతున్న ట్రంప్?

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయనే ఆరోపణలతో భారత్, చైనా సహా 16 దేశాలపై దర్యాప్తునకు ట్రంప్ ఆదేశించారు. గతంలో వివిధ దేశాలపై విధించిన అదనపు టారిఫ్‌లను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ విచారణ ఆయా దేశాలు అమెరికా విషయంలో అన్యాయమైన ట్రేడ్ ప్రాక్టీసెస్‌ను అమలు చేస్తున్నాయని నిర్ధారిస్తే మళ్లీ టారిఫ్స్ వేయడం లేదా ఇతర ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
News March 12, 2026
ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.
News March 12, 2026
కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి..

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్ లేదని, బుక్ చేసినా రావడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా కొందరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. చెన్నైలో ఓ హోటల్ యజమాని బట్టీ కట్టించుకుని పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించుకున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.


