News October 10, 2025

మోదీ కోసం కీలక మీటింగ్‌ను మధ్యలోనే ఆపేసిన నెతన్యాహు

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఫోన్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే సీజ్‌ఫైర్, బందీల విడుదల ఒప్పందంపై నెతన్యాహు కీలకమైన సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ నిర్వహిస్తుండగా ఈ కాల్ వచ్చినట్లు సమాచారం. దీంతో సమావేశాన్ని కొద్ది సేపు నిలిపేసి మోదీతో మాట్లాడారని ఇజ్రాయెల్ పీఎం ఆఫీసు వెల్లడించింది. బందీల విడుదల కోసం కుదిరిన ఒప్పందంపై నెతన్యాహును మోదీ అభినందించారని చెప్పింది.

Similar News

News October 10, 2025

ఎల్లుండి జూబ్లీ‌హిల్స్ బైపోల్ బీజేపీ అభ్యర్థి ప్రకటన?

image

TG: జూబ్లీ‌హిల్స్ బైపోల్ అభ్యర్థి కోసం BJP తీవ్ర కసరత్తు చేస్తోంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవితో పాటు మరొకరిని షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఈ జాబితాను రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. అక్కడ చర్చించి ఎల్లుండి అభ్యర్థిని ప్రకటించనున్నారు. అయితే ఈ అభ్యర్థుల పేర్లతో కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని టాక్.

News October 10, 2025

కారాగారాలు కాదు… కర్మాగారాలు

image

నేరాలు, నేరారోపణలతో ఖైదీలుగా మారిన పలువురు జైళ్లలో తమ నైపుణ్యాలతో ఏటా వందల కోట్ల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఐదేళ్లలో ₹1900 కోట్లను అవి ఆర్జించాయని ఇటీవల NCRB ప్రకటించింది. అత్యధికంగా 2019లో ₹846 కోట్ల ఆదాయం రాగా 2023లో జైళ్లు ₹274 కోట్లు ఆర్జించాయి. అందులో TN ₹67CR, TG ₹56 కోట్లు, ఏపీ ₹12 కోట్లు సాధించాయి. ఫర్నీచర్, దుస్తులు, ఆహార పదార్థాలు, వివిధ పంటలు ఇలా పలు రకాలు ఉత్పత్తి అవుతున్నాయి.

News October 10, 2025

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

*పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ఆమోదం
*అమరావతిలో సదరన్ గ్రూప్ హోటల్ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్
*అమరావతిలో రూ.400 కోట్లతో దసపల్లా 4స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం
*అనంతపురంలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం
*రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించిన క్యాబినెట్
*పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు అంగీకారం
*ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు ఆమోదం