News August 26, 2024
హెజ్బొల్లాకు నెతన్యాహు వార్నింగ్

తమ దేశంపైకి భారీగా రాకెట్లను ప్రయోగిస్తోన్న లెబనాన్‌లోని <<13937104>>హెజ్బొల్లా<<>> గ్రూప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. కథ ముగిసిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ‘హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్లను విజయవంతంగా కూల్చేశాం. రివర్స్ అటాక్ చేశాం. వారి దుందుడుకు చర్యలను అణచివేశాం’ అని తెలిపారు.
Similar News
News January 23, 2026
RS ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

TG: బీఆర్ఎస్ నేత RS ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని, 2 రోజుల్లో ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇవాళ ఉదయం మీడియా సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ ‘సజ్జనార్‌పై 7 ట్యాపింగ్ కేసులు ఉన్నాయి. ఆయనపైనే లోతైన విచారణ జరగాలి. ఆయన్ను సిట్ చీఫ్‌గా ఎలా నియమిస్తారు. ఆయన ఎలా ట్యాపింగ్ కేసును విచారిస్తారు?’ అని ప్రశ్నించారు.
News January 23, 2026
V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
News January 23, 2026
ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.


