News January 30, 2025
పుష్ప-2 సినిమాకు నెట్‌ఫ్లిక్స్ మాస్ ఎలివేషన్

పుష్ప-2 మూవీ అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అల్లు అర్జున్ అభిమానుల్లో జోష్‌ను మరింత పెంచేందుకు OTT సంస్థ మాస్ ఎలివేషన్లు ఇస్తోంది. తన అధికారిక ఇన్‌స్టా, X అకౌంట్ల బయోలో ‘ఈ పేజీ పుష్ప పాలనలో ఉంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఇన్నాళ్లూ థియేటర్లలో కొనసాగిన పుష్ప గాడి హవా ఓటీటీలోనూ కంటిన్యూ అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 3.44 గంటల నిడివితో మూవీ అందుబాటులో ఉంది.
Similar News
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. హనుమకొండ జిల్లాకు ఏం కావాలంటే?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లాలోని పెండింగ్ పనులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్పోర్ట్ భూ-సేకరణ పూర్తి చేయాలని, కాజీపేట రైల్వే ఫ్లై-ఓవర్ చేపట్టాలని కోరుతున్నారు. WGL కలెక్టరేట్ పనులు, నూతన బస్టాండ్ పనులు, టెక్స్ టైల్ పార్కులో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
News March 12, 2025
సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తా: మంత్రి లోకేశ్

AP: కడప జిల్లాలోని కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కూల్చివేయడం బాధాకరం. నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి కూల్చకుండా ఉండాల్సింది. దీనిపై ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను’ అని ట్వీట్ చేశారు.
News March 12, 2025
పోసాని విడుదలకు బ్రేక్!

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.