News September 5, 2024
ఇతర ఇండస్ట్రీల వారెందుకు విరాళమివ్వట్లేదని నెటిజన్లు ఫైర్

భారీ వర్షాలకు తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే టాలీవుడ్ నటులు తోచిన సాయం చేస్తున్నారు. హీరోయిన్స్ మాత్రం నోరు మెదపట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా కేరళలో వరదలొస్తే చిరు, ప్రభాస్, అల్లు అర్జున్ తదితర టాలీవుడ్ నటులు రూ.కోట్లు సాయం ఇచ్చారని, కర్ణాటక, తమిళనాడులో ఏం జరిగినా మనోళ్లు ముందుంటారని ట్వీట్స్ చేస్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాలకు జరిగినప్పుడు ఎవరూ ఇవ్వట్లేదని ఫైరవుతున్నారు. మీరేమంటారు?
Similar News
News December 19, 2025
విచారణకు రాని ఫిరాయింపు MLAల కేసు

ఫిరాయింపు MLAల కేసు SCలో ఈరోజు లిస్టయినా విచారణకు రాలేదు. లంచ్ బ్రేక్ తరువాత వస్తుందనుకున్నా ఇతర కేసులతో విచారణ జరగలేదు. SCకి క్రిస్మస్, శీతాకాలం సెలవులు జనవరి 4వరకు ఉంటాయి. ఆ తరువాత కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా సుప్రీం ఇచ్చిన గడువులో స్పీకర్ ఐదుగురు MLAలపై <<18592868>>నిర్ణయం<<>> తీసుకున్నారు. మరో ఐదుగురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేసు విచారణకు వచ్చేలోపు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
News December 19, 2025
చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.
News December 19, 2025
నాబార్డ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

<


