News August 25, 2024
సూర్యతో మను.. దేశం గర్వించే అథ్లెట్లంటూ నెటిజన్ల ప్రశంస

పారిస్ ఒలింపిక్స్‌లో 2 బ్రాంజ్ మెడల్స్ సాధించిన షూటర్ మనూ భాకర్ టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కలిశారు. అతడితో దిగిన ఫొటోను Xలో షేర్ చేసిన మను ‘భారత మిస్టర్ 360 వద్ద కొత్త ఆటలో టెక్నిక్స్ నేర్చుకుంటున్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోలో మను బ్యాటింగ్ చేస్తున్నట్లు, సూర్య పిస్టల్ పట్టుకున్నట్లు పోజు ఇచ్చారు. ‘ఇద్దరూ దేశం గర్వించే అథ్లెట్లు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 26, 2026
నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.
News March 26, 2026
ALERT: టేస్ట్ కోసం చూస్తే.. ప్రాణాపాయమే!

ఫాస్ట్‌ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే మీరు డయాబెటిక్ వ్యాధిని కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే TG, AP, TN, కేరళం, కర్ణాటకలో ఫాస్ట్‌ఫుడ్ వినియోగం పెరిగిందని IJMR స్టడీ వెల్లడించింది. బయటి ఆహారంపై ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే షుగర్, ఊబకాయం బారిన పడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రూరల్ ఏరియాలో కంటే సిటీల్లో దీని వినియోగం ఎక్కువగా ఉంది.
News March 26, 2026
కరెంట్ అఫైర్స్

* JNTUH బీటెక్ విద్యార్థి శివకుమార్ ఇందూరికి ‘జలశక్తి హ్యాకథాన్ 2025’ పురస్కారం.
* సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 1,05,07,879.
* నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, IIT మద్రాస్ రోడ్లపై ‘పొగమంచును హరించే’ టైటానియం డయాక్సైడ్ పూతలను పరీక్షిస్తున్నాయి.
* పుణేలోని శాస్త్రవేత్తలు Neoloboptera peninsularis అనే కొత్త బొద్దింక జాతిని కనుగొన్నారు.


