News January 30, 2025
తెలంగాణ కాంగ్రెస్కు నెటిజన్ల షాక్!

తెలంగాణ కాంగ్రెస్కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. ‘రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?’ అని అధికారిక X ఖాతాలో పోల్ పెట్టగా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అనే రెండు ఆప్షన్లు ఇవ్వగా ఫామ్ హౌస్ పాలనకు 73% మంది ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన పరువు తానే పోగొట్టుకుందని బీఆర్ఎస్ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నాయి.
Similar News
News October 25, 2025
కార్తిక మాసంలో ఏరోజు పవిత్రమైనది?

కార్తీక మాసంలో ప్రతి దినం భగవత్ చింతనకు శ్రేష్ఠమైనదే. అయితే కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, రుద్రాభిషేకం చేసేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట, ఉసిరి చెట్టును పూజించడం శుభాలకు మూలం. కార్తీక పౌర్ణమి ఈ మాసానికి శిఖరాయమానం. ఈ రోజున చేసే నదీ స్నానం, దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహం లభించి, జన్మజన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
News October 25, 2025
నా కొడుకు వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దరామయ్య

తన రాజకీయ జీవితంపై కొడుకు యతీంద్ర చేసిన <<18075196>>వ్యాఖ్యలను<<>> వక్రీకరించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాబోయే సీఎం ఎవరనే విషయమై కాకుండా విలువల గురించి తన కొడుకు మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై తాను ఇప్పుడే స్పందించనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతానని చెప్పారు.
News October 25, 2025
విరాట్ త్వరగా ఫామ్లోకి రావాలి: రవిశాస్త్రి

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వీలైనంత త్వరగా ఫామ్లోకి రావాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ‘జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. రోహిత్, కోహ్లీ, ఎవరైనా రిలాక్స్ అవడానికి లేదు. ఫుట్వర్క్ విషయంలో విరాట్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. వన్డే క్రికెట్లో అతని రికార్డు అమోఘం. రెండు వన్డేల్లోనూ పరుగులు చేయకపోవడం కోహ్లీని నిరాశకు గురిచేసి ఉండవచ్చు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.


