News June 16, 2024

నేత్రావల్కర్‌కు జీతం పెంచాలి.. నెటిజన్ల డిమాండ్

image

ఓవైపు ఒరాకిల్ వంటి సంస్థలో ఉద్యోగం చేస్తూ, అమెరికా తరఫున బౌలర్‌గానూ రాణిస్తున్నారు సౌరభ్ నేత్రావల్కర్. యూఎస్ఏ జట్టు సూపర్-8కు చేరుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సౌరభ్‌కు జీతాన్ని పెంచాలంటూ ఒరాకిల్‌ను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అతడికి పని బరువును తగ్గించాలని కోరుతున్నారు. ముంబైలో పుట్టిన సౌరభ్ 2010లో భారత్ తరఫున అండర్-19 వరల్డ్ కప్ ఆడారు. ఉద్యోగరీత్యా USలో స్థిరపడ్డారు.

Similar News

News February 2, 2025

NPS వాత్సల్య.. రూ.50వేలకు పన్ను మినహాయింపు

image

బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే <<14158275>>NPS వాత్సల్య పథకంపై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్‌లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ఏడాది ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 90వేల ఖాతాలు ప్రారంభమయ్యాయి. పన్ను ఊరటతో అకౌంట్ల సంఖ్య భారీగా పెరగనుంది.

News February 2, 2025

దేశ అప్పు రూ.181 లక్షల కోట్లు

image

దేశంపై అప్పుల భారం పదేళ్లలో ఏకంగా 192 శాతం పెరిగింది. 2015 మార్చి 31 నాటికి రూ.62 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి నెలాఖరుకు రూ.181 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో విదేశీ రుణం 6.18 లక్షల కోట్లు, అంతర్గత అప్పు రూ.175 లక్షల కోట్లని తెలిపింది. 2026 మార్చి 31కి మొత్తం అప్పు రూ.196 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొంది.

News February 2, 2025

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేయాలి: సీఎం

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతుండటం, ప్యాకేజీ 3 పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే 8kms ఓపెన్ కెనాల్ పనులు ఆగిపోయాయని, ఎస్టిమేట్స్ రివైజ్ చేయాలని కాంట్రాక్టర్ అడగడంతో సమస్య వచ్చినట్లు అధికారులు వివరించారు.