News November 9, 2024
జీవితంలో ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దు: ద్రవిడ్

జీవితంలో ఎప్పుడూ ఓటమిని అంగీకరించొద్దని, డీలా పడిపోవద్దని భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సూచించారు. సమస్యలున్నా చివరి వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ‘టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాకు కేవలం 30 బంతుల్లో 30 రన్స్ కావాలి. మేం గెలుస్తామని ఆ సమయంలో ఎవరూ ఊహించి ఉండరు. పరిస్థితి కష్టమే కానీ భారత్ గెలిచింది. జీవితంలోనైనా అంతే. పోరాటం ఆపకూడదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
బిడ్డకు పాలిస్తే క్యాన్సర్ నుంచి రక్షణ

తల్లిపాలివ్వడం బిడ్డకే కాదు తల్లికీ రక్షేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దీనివల్ల మహిళల్లో ఎక్కువగా కనిపించే ట్రిపుల్ నెగెటివ్ అనే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. డెలివరీ తర్వాత వక్షోజాల్లో సీడీ8+టీ అనే వ్యాధినిరోధక కణాలు ఏర్పడతాయి. ఇవి శక్తిమంతమైన రక్షకభటుల్లా పనిచేస్తూ వక్షోజాల్లోని క్యాన్సర్ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
News November 15, 2025
30 ఓట్లతో గెలిచాడు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒకే ఒక్క సీటు గెలిచింది. రామ్గఢ్ నుంచి పోటీ చేసిన సతీశ్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్లతో గట్టెక్కారు. ఆయనకు 72,689 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్కు 72,659 ఓట్లు పడ్డాయి. చివరి వరకూ ఇద్దరి మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా సతీశ్నే వరించింది. ఇక బిహార్లో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
News November 15, 2025
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 12 గోదాముల ఏర్పాటు

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.155.68 కోట్ల నిధులతో 12 గోదాములను నిర్మించనుంది. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. కరీంనగర్ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లిలో, NLG జిల్లా దేవరకొండ, VKB జిల్లా దుద్యాల, హనుమకొండ జిల్లా వంగర, ములుగు జిల్లా తాడ్వాయి, మెదక్ జిల్లా అక్కన్నపేట, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మంచిర్యాల జిల్లా మోదెలలో వీటిని నిర్మించనున్నారు.


