News June 29, 2024

టీ20 WC చరిత్రలో ఒక్కసారీ అలా జరగలేదు!

image

టీ20 WC చరిత్రలో ఇప్పటివరకూ ఫైనల్ ఆడిన జట్లు మరోసారి ఫైనల్‌లో తలపడలేదు. ప్రతీ ఎడిషన్‌లో కొత్త ప్రత్యర్థులే ఎదురుపడ్డారు. భారత్VSపాక్ (2007), పాక్VSశ్రీలంక (2009), ఇంగ్లండ్VSఆసీస్ (2010), వెస్టిండీస్VSశ్రీలంక (2012), శ్రీలంకVSభారత్ (2014), వెస్టిండీస్VSఇంగ్లండ్ (2016), ఆస్ట్రేలియాVSన్యూజిలాండ్ (2021), ఇంగ్లండ్VSపాక్(2022), సౌతాఫ్రికాVSఇండియా (2024) ఫైనల్ చేరాయి.

Similar News

News December 11, 2025

6 దేశాల్లో ధురంధర్ బ్యాన్.. ఎందుకంటే?

image

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం ఈ వారంలో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రానికి గల్ఫ్ దేశాల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశాల్లో మూవీ రిలీజ్ కోసం టీమ్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ దేశాల్లో రిలీజ్ చేయలేదు. ‘యాంటీ పాకిస్థాన్ కంటెంట్’ అన్న కారణంతోనే ఆ దేశాలు మూవీని బ్యాన్ చేశాయి.

News December 11, 2025

ఆజన్మబ్రహ్మచారి ఆంజనేయుడు!

image

ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారిగా ప్రసిద్ధి. అయితే హనుమంతుడు కూడా వివాహం చేసుకున్నట్లు కొందరు పండితులు చెబుతున్నారు. అయినా కూడా ఆంజనేయుడు బ్రహ్మచారేనని అంటారు. ఈ వైరుధ్యాలు ఏంటి? హనుమంతుడికి వివాహమైతే బ్రహ్మచారిగానే ఎందుకు పిలవబడుతున్నట్లు? ఈరోజు అనగనగాలో..
<<-se>>#anaganaga<<>>

News December 11, 2025

సర్పంచ్‌గా గెలిచిన చనిపోయిన అభ్యర్థి

image

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర సన్నివేశం వెలుగు చూసింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా RRకాలనీ సర్పంచ్‌గా ఇటీవల మరణించిన చర్ల మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై సుమారు 300కుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. నామినేషన్ అనంతరం మురళి మరణించడంతో గ్రామస్థులు ఆయనకే ఓటు వేశారు. దీంతో ఎన్నికల ఫలితంపై ఏం చేద్దామన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.