News March 25, 2024

ఇంత ద్వేషం ఎప్పుడూ చూడలేదు: పీటర్సన్

image

గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య లక్ష్యంగా ఫ్యాన్స్ హేళన చేశారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించారు. తన జీవితంలో ఏ భారత క్రికెటర్‌ను ఇంతలా హేళన చేయడం చూడలేదని అన్నారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు పాండ్యను ఉద్దేశిస్తూ ఫ్యాన్స్ గేలి చేస్తూ కేకలు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Similar News

News December 8, 2025

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదు: పవన్

image

సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, ఆధ్యాత్మిక శాస్త్రమని AP Dy.CM పవన్ అన్నారు. ‘TNలో మన ధర్మాన్ని మనం అనుసరించడం కోసం న్యాయ పోరాటాలు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రతి హిందువులో చైతన్యం రావాలి. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు. ముఖ్యంగా యువత గీత చదవాలి. మనసు కుంగినా, ఆలోచనలు అయోమయంలోకి నెట్టినా గీత ఓ కౌన్సిలర్‌, మెంటర్‌గా పనిచేస్తుంది’ అని ఉడుపి క్షేత్రంలో చెప్పారు.

News December 8, 2025

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనం గర్వపడాలి: విజయ్

image

ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని IND మాజీ క్రికెటర్ మురళీ విజయ్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌‌లో మాట్లాడుతూ.. ‘ధోనీ సహజ, ప్రత్యేకమైన నాయకుడు. ఆయనలా నిర్ణయాలు తీసుకోవడం మరొకరికి సాధ్యం కాదు. 2007 T20 WC చివరి ఓవర్ జోగిందర్ శర్మతో వేయించడం ఇలాంటిదే. ధోనీ కొట్టే సిక్సర్ల రేంజ్ మరో రైట్ హ్యాండ్ బ్యాటర్‌ వల్ల కాదు’ అని వ్యాఖ్యానించారు. మహీ కెప్టెన్సీలో విజయ్ 8 సీజన్ల పాటు CSKకు ఆడారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు రాలేను: ఖర్గే లేఖ

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు హాజరు కాలేకపోతున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల నేపథ్యంలో రాలేకపోతున్నట్లు వివరించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రేవంత్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఇవాళ, రేపు సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే.