News February 12, 2025
కొత్త 50 రూపాయల నోట్లు

ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
Similar News
News October 14, 2025
ఏపీ రౌండప్

* ఏపీ హైకోర్టుకు ముగ్గురు జడ్జిల బదిలీ.. గుజరాత్ HC నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ నుంచి జస్టిస్ డూండి రమేశ్, కోల్‌కతా నుంచి జస్టిస్ సుబేందు సమంత బదిలీ
* వైజాగ్‌లోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు మినీ రత్న హోదా
* కురుపాం ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ అంతార్ సింగ్ ఆర్యకు YCP నేతల ఫిర్యాదు
* విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్ట్ టెండర్ల గడువు ఈ నెల 24 వరకు పొడిగింపు
News October 14, 2025
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకు సర్కార్.. గురు/శుక్రవారం విచారణ!

TG: స్థానిక ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రిజర్వేషన్ల GOను కొట్టివేస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలివ్వగా, దానిపై SLPని దాఖలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ న్యాయవాది సుప్రీం రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేశారు. CJI అనుమతితో లిస్ట్ చేస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
News October 14, 2025
ఆహార కల్తీని అడ్డుకోలేరా?.. FSSAIపై విమర్శలు

ఇండియాలో అత్యంత అవినీతి & పనికిరాని సంస్థ FSSAI అని నెటిజన్లు ఫైరవుతున్నారు. మార్కెట్లో కల్తీ ఆహారం, నాణ్యత లేని ప్యాకేజ్డ్ ఫుడ్లు యథేచ్ఛగా అమ్ముడవుతున్నా ఈ సంస్థ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. సమస్య వచ్చిన తర్వాతే స్పందిస్తోందని మండిపడుతున్నారు. ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణమైన కల్తీ ఆహారాన్ని నియంత్రించడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?