News August 30, 2024
Gmailలో కొత్త AI ఆప్షన్.. ఇక సమాచారం క్షణాల్లో తెలుసుకోవచ్చు

ఆండ్రాయిడ్ వర్క్ స్పేస్ యూజర్ల కోసం గూగుల్ Gmailలో కొత్త AI ఫీచర్ను తీసుకొచ్చింది. జెమిని-పవర్డ్ Gmail Q&Aని అప్డేట్ చేసింది. దీని ద్వారా యూజర్లు తమ ఇన్బాక్స్లోని ఈమెయిల్స్ నుంచి నిర్దిష్ట సమాచారాన్ని గుర్తించడానికి Gmailలోనే జెమినిని ప్రాంప్ట్ చేయవచ్చు. కావాల్సిన సమాచారం ఏ మెయిల్లో ఉన్నది గుర్తించి మనకు అందిస్తుంది. యాప్లో కుడివైపున బ్లాక్ జెమిని స్టార్పై ట్యాప్ చేసి వాడుకోవచ్చు.
Similar News
News December 30, 2025
పాన్-ఆధార్ లింక్.. రేపే లాస్ట్ డేట్

పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువు రేపటితో(DEC 31) ముగియనుంది. లింక్ చేసేందుకు IT <
News December 30, 2025
బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యక్తి హత్య

బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్ జిల్లాలోని వాలుకా ప్రాంతంలోని ఓ దుస్తుల కర్మాగారంలో పని చేస్తున్న హిందూ కార్మికుడు బజేంద్ర బిస్వాస్ హత్యకు గురయ్యారు. సహోద్యోగి నోమన్ మియా షాట్గన్తో కాల్చగా అది బిస్వాస్ తొడకు తగలడంతో తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
News December 30, 2025
‘SIR’ పెద్ద స్కామ్: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంకురా జిల్లా బిర్సింగ్పూర్ ర్యాలీలో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు. AIతో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ పెద్ద మోసమని, భారీగా ఓటర్ల పేర్లు తొలగించే యత్నం జరుగుతోందన్నారు. అర్హుడైన ఒక్క ఓటర్ పేరు తొలగించినా ఢిల్లీలోని EC కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


