News February 4, 2025

మస్తాన్ సాయి కేసులో కొత్త కోణం

image

TG: మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్న <<15351108>>అభ్యంతరకర వీడియోల<<>> కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రికార్డు చేసిన వీడియోలతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసినట్లు, ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న వారిని బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు 100 మందిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు. మస్తాన్‌ను మరోసారి కస్టడీలోకి తీసుకుంటారని సమాచారం. బాధితులెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

Similar News

News March 7, 2026

విటమిన్ల కోసం వీటిని తీసుకోండి!

image

శరీర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి విటమిన్లు అత్యవసరం. క్యారెట్లు, లివర్‌లో విటమిన్ A ఉంటుంది. B1- తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2- పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశెనగ. B5- అవకాడో, గుడ్లు. B6- అరటిపండు, సాల్మన్ ఫిష్. B7- గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B12- చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్స్. E- సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం. C -నారింజ, జామ. SHARE IT

News March 7, 2026

విజయ్‌‌కి భార్య షాక్.. కోర్టులో మరో పిటిషన్!

image

టీవీకే అధినేత విజయ్‌కి ఆయన భార్య సంగీత <<19295692>>మరోసారి<<>> షాక్ ఇచ్చారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని అందులో కోరారు. ‘చెన్నై నీలంకరైలోని ఇంట్లో నాకూ సగం వాటా ఉంది. విడాకుల కేసు ముగిసే వరకు, నేను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలి’ అని తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.

News March 7, 2026

సుప్రీంలీడర్‌ను ఇరాన్ కావాలనే ప్రకటించట్లేదా?

image

ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఖమేనీ కొడుకు మొజ్తాబాను నియమించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వాటిలో <<19297127>>నిజం లేదని<<>> అక్కడి ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో సుప్రీంలీడర్ నియామకంపై ఇరాన్ కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొజ్తాబాను ప్రకటిస్తే చంపేస్తారనే భయంతో సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఎవరిని ఎన్నుకున్నా అంతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించడం, కొత్తగా <<19290160>>బాధ్యతలు చేపట్టిన<<>> పలువురిని చంపడం తెలిసిందే.