News October 4, 2025
ఆటో డ్రైవర్ల కోసం కొత్త యాప్: చంద్రబాబు

AP: ఉబర్, ర్యాపిడోల పోటీని తట్టుకునేలా ఆటో డ్రైవర్లకు అండగా ఉండేందుకు కొత్త యాప్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో ఎక్కడ ఉన్నా నేరుగా బుకింగ్స్ డ్రైవర్లకు వెళ్తాయని చెప్పారు. 24 గంటలు ఆటో స్టాండ్‌లో ఉండే పనిలేకుండా చేస్తామన్నారు. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు తీసుకొస్తామన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, యాప్ నిర్వహణ డ్రైవర్లు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News October 4, 2025
పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. బయటికి రావద్దని హెచ్చరికలు

AP: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. బయట ఉన్నవారు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.
News October 4, 2025
మీకు తెలుసా? మెమరీలో మహిళలే బెస్ట్

పురుషులతో పోలిస్తే మహిళల్లో మెమరీ స్కిల్స్ అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఏవైనా ఘటనలనే కాకుండా కొత్త ముఖాలు, లిస్టులోని వస్తువులు, మాటలను కూడా ఎక్కువకాలం గుర్తుపెట్టుకుంటారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్ ఉమెన్స్‌లో ఈ శక్తి అధికంగా ఉంటుంది. అయితే రుతుక్రమం ఆగిపోయిన తర్వాత మెమరీ స్కిల్ క్రమంగా తగ్గినప్పటికీ మగాళ్ల కంటే బెటర్‌గా ఉంటుంది.
News October 4, 2025
షమీ కెరీర్ ముగిసినట్లేనా?

ఇండియన్ పేసర్ షమీ ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపికవ్వకపోవడంతో అతడి కెరీర్ ముగిసిందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా గాయాలు కంబ్యాక్‌ను అడ్డుకుంటున్నాయి. ఇప్పుడున్న పోటీకి తోడు 6 నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవడం షమీ కెరీర్ ప్రమాదంలో పడేలా ఉంది. పైగా వ్యక్తిగత సమస్యలు కూడా అతడు తిరిగి పుంజుకోవడానికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. షమీ 64 టెస్టులు, 108 వన్డేలు, 25 T20లు ఆడారు.