News April 12, 2024
కోడ్ ముగిసిన తర్వాతే ‘గృహజ్యోతి’కి కొత్త దరఖాస్తులు

TG: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గృహజ్యోతి(ఫ్రీ కరెంట్)కి కొత్త అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత 36లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశారు. రాష్ట్రంలో 86లక్షలకు పైగా అర్హులు ఉండటంతో మిగిలినవారి నుంచి దరఖాస్తులను కోడ్ ముగిసిన వెంటనే స్వీకరించనున్నారు. గతనెల జీరో బిల్లు జారీ చేసిన 36లక్షల కుటుంబాలకు ఈనెల యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
Similar News
News December 15, 2025
చిరంజీవికి ఆ లుక్ వద్దని చెప్పా: అనిల్ రావిపూడి

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానన్నారని, తానే వద్దని చెప్పినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే చూపిస్తానని చెప్పానని అనిల్ అన్నారు. కాగా ఈ మూవీలో వెంకీ-చిరు కాంబినేషన్లో 20 నిమిషాల సీన్స్ ఉంటాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుండగా, ఇప్పటికే వెంకీ రోల్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.
News December 15, 2025
డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం
News December 15, 2025
మెస్సీ.. ఇండియాలో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఇదే!

ఫుట్బాల్ స్టార్ మెస్సీ గురించే ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. 3 రోజుల భారత పర్యటనలో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి ఓ కారణం ఉంది. ఆయన ఎడమ కాలుకు రూ.8వేల కోట్ల విలువ చేసే ఇన్సూరెన్స్ ఉంది. అయితే దేశం తరఫున, ఫ్రాంచైజీ లీగ్ మ్యాచుల్లో ఆడే సమయంలో కాలికి ఏమైనా జరిగితేనే ఇది వర్తిస్తుంది. ఎగ్జిబిషన్ మ్యాచులకు ఇది చెల్లుబాటు కాదు. దీంతో ఆయన మ్యాచుల్లో పూర్తి స్థాయిలో ఆడట్లేదని సమాచారం.


