News December 18, 2024
కొత్త అసెంబ్లీ అవసరం: కోమటిరెడ్డి

TG: రాష్ట్రంలో కొత్త అసెంబ్లీ అవసరమని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు. అది కూడా సచివాలయం పక్కనే ఉంటే బాగుంటుందని చెప్పారు. ‘హుస్సేన్ సాగర్ ఒడ్డున సచివాలయం, అసెంబ్లీ, అమరవీరుల స్తూపం అన్ని ఒకచోట ఉండటం మంచిది. పాలనాపరంగా పక్కపక్కనే ఉంటే సౌలభ్యంగా ఉంటుంది. అవసరమైతే FTL పరిధిని కుచించి మరీ ఈ నిర్మాణాలు చేపట్టవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
WTC: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

SAతో తొలి టెస్టులో ఓటమితో భారత్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ ఇండియా ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడి 4 విజయాలు, 3 ఓటములు, ఓ మ్యాచ్ డ్రాగా ముగించింది. ప్రస్తుతం IND విజయాల శాతం 54.17గా ఉంది. ఇక ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన AUS అగ్రస్థానంలో ఉండగా, సఫారీలు(విజయాల శాతం 66.67) రెండో స్థానంలో ఉన్నారు. 3, 5, 6, 7వ స్థానాల్లో SL(66.7), PAK(50.00), ENG(43.33), BAN(16.7) ఉన్నాయి.
News November 16, 2025
టెట్ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్థులు కూడా జనరల్ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.
News November 16, 2025
250 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 250 గ్రూప్-B పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్ 2023/24/25 స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 30 ఏళ్లు మించరాదు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ.99,000 వరకు ఉంటుంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.
వెబ్సైట్: https://cabsec.gov.in/


