News January 12, 2025
రాష్ట్రంలోకి కొత్త బీర్లు, లిక్కర్!

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం రానుంది. దీని కోసం కొత్త లిక్కర్, బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు కంపెనీల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు. లిక్కర్ తయారీలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదన్నారు. మరోవైపు మద్యం ధరలు పెంచబోమని సీఎం స్పష్టం చేశారు.
Similar News
News October 18, 2025
అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.
News October 18, 2025
దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

TG: దీపావళి పండుగకు 2 రోజుల ముందు వచ్చిన ‘రాష్ట్ర బంద్’ పండుగ వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వారాంతం కూడా కావడంతో ప్రజలు దీపావళి షాపింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. వస్త్ర, గోల్డ్, స్వీట్స్ దుకాణదారులు ఇవాళ భారీ వ్యాపారాన్ని ఆశించారు. కానీ బీసీ సంఘాల బంద్ పిలుపుతో జనం రాక తగ్గి బిజినెస్పై ఎఫెక్ట్ పడుతుందని వారు ఆందోళనలో ఉన్నారు. బంద్ ప్రభావం ఎంతో సాయంత్రానికి క్లారిటీ వస్తుంది.
News October 18, 2025
నేడు ఈ వ్రతం చేస్తే బాధల నుంచి విముక్తి

శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని నేడు ఆచరిస్తే అపారమైన ఐశ్వర్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు, ఉద్యోగాభివృద్ధి కోరేవారు ఈ వ్రతం చేస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరిగి, దారిద్య్రం తొలగి, అన్నింటా విజయం లభిస్తుందంటున్నారు. ధనాదిదేవత లక్ష్మీదేవి, ధనాధ్యక్షుడు కుబేరుని ఆశీస్సులతో శుభం కలుగుతుందంటున్నారు.