News July 3, 2024
విమానం తరహాలో సరికొత్త బస్సులు!

కాలుష్యాన్ని అధిగమించేందుకు విమానం తరహాలో 132 సీట్ల బస్సును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు వెల్లడించారు. మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఏర్పాటు చేస్తారు. ఈ బస్సు 40 సెకన్లు ఛార్జింగ్ చేస్తే 40 కి.మీ ప్రయాణిస్తుంది. విమానంలోలా సీటింగ్, ఏసీ, ఫుడ్, డ్రింక్స్ ఉంటాయి. వీటిని అందించడానికి ‘బస్ హోస్టెస్’ ఉంటారు.
Similar News
News January 19, 2026
వంటింటి చిట్కాలు

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.
News January 19, 2026
న్యూజిలాండ్‌కు T20WC గెలిచే అవకాశాలు: వాన్

వచ్చే నెలలో జరిగే టీ20 వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు న్యూజిలాండ్‌కు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ అంచనా వేశారు. ఆ జట్టులోని ప్లేయర్లకు ఆ సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్ టీమ్ ఇండియాతో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ప్రస్తుతం టీ20ల్లో తొలి ర్యాంకులో భారత్ ఉండగా NZ 4వ ర్యాంకులో కొనసాగుతోంది. దీంతో WC ముందు ఈ సిరీస్ విజయం ఇరు జట్లకు కీలకమే.
News January 19, 2026
మళ్లీ నేల చూపులే.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 615 పాయింట్లు కోల్పోయి 82,955 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు నష్టపోయి 25,512 వద్ద కొనసాగుతున్నాయి. ICICI బ్యాంక్(3.45%), రిలయన్స్(2.3%), ఇన్ఫోసిస్(1.18%) నష్టపోగా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్(3.73%), TECHM(3.66%), మారుతీ సుజుకీ(1.3%) లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్స్ ప్రభావం మార్కెట్లపై పడిందని ఎక్స్‌పర్టులు అంటున్నారు.


