News March 17, 2024
కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లు.. ఉత్తర్వులు జారీ

TG: రాష్ట్రంలో మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తూ ఈ పదవులిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికీ అవకాశం కల్పించారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం నియమించిన ఛైర్మన్లను తొలగించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 16, 2025
2028 నాటికి చంద్రయాన్-4 పూర్తి: నారాయణన్

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు చేయనున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీటిలో PSLV, గగన్‌యాన్ మిషన్లతోపాటు ఓ కమర్షియల్ శాటిలైట్ ప్రయోగమూ ఉందని చెప్పారు. ‘చంద్రయాన్-4కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేస్తాం’ అని వివరించారు.
News November 16, 2025
ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు: కవిత

TG: మగ పిల్లల చదువు కోసం అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు కానీ ఆడపిల్లలను మాత్రం ఆపేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విద్యావ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఆడపిల్లల చదువు చాలా డెలికేటెడ్ సమస్యగా మారింది. బస్సు లేకపోయినా, వీధి దీపం లేకపోయినా సరే ఆడపిల్లల చదువు ఆపేస్తున్నారు. బాలికల విద్య, ఉద్యోగానికి సంబంధించి సపరేట్ విధానం అమలు చేయాలి’ అని తెలిపారు.
News November 16, 2025
విజయనగరం జిల్లాలో జాబ్ మేళా

AP:విజయనగరం జిల్లాలోని మహారాజ్ కాలేజీలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ITI, డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc, MSc (నర్సింగ్), ఫార్మసీ ఉత్తీర్ణులై, 18- 45ఏళ్ల లోపు వారు అర్హులు. 280 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ కార్డ్ తప్పనిసరి. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: employment.ap.gov.in


