News June 21, 2024

కొత్త కార్పొరేషన్లు.. అదనంగా 300 ఉద్యోగాలు!

image

TG: రాష్ట్రంలో SC, ST, BC వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 కార్పొరేషన్లు, బోర్డుల కార్యకలాపాల ప్రారంభానికి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులను కొత్తవాటిలో సర్దుబాటు చేసి, మిగిలిన పోస్టుల్లో సుమారు 300 కొత్త ఉద్యోగాల మంజూరుకు ప్రభుత్వానికి సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు పంపనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని చూస్తున్నాయి.

Similar News

News November 7, 2025

వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

image

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.

News November 7, 2025

‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

image

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.

News November 7, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.1,22,020కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.470 పతనమై రూ.1,11,880 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.