News February 14, 2025
FEB 19/20న ఢిల్లీ కొత్త CM ప్రమాణ స్వీకారం?

అమెరికా నుంచి ప్రధాని నరేంద్రమోదీ తిరుగు పయనమవ్వడంతో ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ నెల 17/18న BJP లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుందని తెలిసింది. ఇక 19/20న కొత్త CM ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. ఇప్పటికే కొందరి పేర్లతో అధిష్ఠానం జాబితా సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, HM అమిత్ షా కలిసి మోదీతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేస్తారు.
Similar News
News January 9, 2026
విడుదలైన కొత్త వంగడాలు.. రైతులకు ఎన్నో లాభాలు

నువ్వులు, సజ్జ, పొగాకు, వరిగ పంటల్లో కొత్త వంగడాలను ఆచార్య N.G.రంగా అగ్రికల్చర్ వర్సిటీ అభివృద్ధి చేసింది. వీటిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తాజాగా జాతీయ స్థాయిలో విడుదల చేశారు. అధిక దిగుబడినిచ్చే YLM 146 నువ్వుల వంగడం, ఎక్కువ పోషకాలు గల APHB 126 సజ్జ, PMV 480(అల్లూరి) వరిగ, ABD 132 బీడీ పొగాకు వంగడాలు విడుదలయ్యాయి. వీటి ప్రత్యేకత తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 9, 2026
ప్రభాస్ ‘రాజాసాబ్’ రివ్యూ&రేటింగ్

నానమ్మ కోరిక తీర్చేందుకు దుష్ట శక్తితో హీరో చేసే ప్రయాణమే ‘రాజాసాబ్’ స్టోరీ. ప్రభాస్ యాక్టింగ్, కామెడీ టైమింగ్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ డైరెక్టర్ మారుతి మూవీని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే, స్లో ఫస్ట్ హాఫ్, అనవసరం అనిపించే సాంగ్స్, సీన్లు మైనస్. స్టోరీ టెల్లింగ్ వీక్‌గా ఉంది. ప్రేక్షకులు కనెక్ట్ కారు. కొన్నిచోట్ల బోర్ కొడుతుంది.
రేటింగ్: 2.25/5
News January 9, 2026
ఇతిహాసాలు క్విజ్ – 122

ఈరోజు ప్రశ్న: రావణుడి కన్నా ముందు శ్రీరాముడు ఇంకా ఎవరెవరితో యుద్ధం చేశాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


