News January 25, 2025
జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్
జియో భారత్ ఫోన్లలో ‘జియో సౌండ్ పే’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోని 5కోట్ల మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని జియో ఇన్ఫొకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీత్ దత్ చెప్పారు. వినియోగదారుల ఆన్లైన్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు అవసరం లేదని, ఫ్రీగా ‘జియో సౌండ్ పే’తో ఫోన్లోనే మెసేజ్ వినొచ్చని తెలిపారు. దీంతో ప్రతి వ్యాపారికి ఏడాదికి రూ.1500 సేవ్ అవుతుందన్నారు.
Similar News
News January 26, 2025
యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి
ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను మోదీ స్మరించుకున్నారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
News January 26, 2025
స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: గవర్నర్
AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ నజీర్ అన్నారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసింది. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు.
News January 26, 2025
అర్ధరాత్రి అకౌంట్లలో రూ.6,000 జమ
TG: ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నారు. రైతు భరోసా కింద పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఎకరాకు రూ.6వేలు అకౌంట్లలో జమ కానున్నాయి. ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు కూడా రూ.6వేలను అకౌంట్లలో వేయనున్నారు. అయితే ఇవాళ ఆదివారం సెలవు కావడంతో అర్ధరాత్రి 12 గంటల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు.