News January 18, 2025
వాట్సాప్లో కొత్త ఫీచర్.. స్టేటస్లకు మ్యూజిక్!

వాట్సాప్లో స్టేటస్లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ వచ్చింది. ఫొటోలకు 15 సెకన్లు, వీడియోలకు వాటి నిడివిని బట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఆడియో కోసం సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News January 25, 2026
రైతులకు శుభవార్త.. భారీగా పెరిగిన వేరుశనగ ధర

గతేడాది ధరలు లేక ఇబ్బందిపడిన వేరుశనగ రైతులకు ఈ ఏడాది ఊరట కలుగుతోంది. ఇటీవల TGలోని కల్వకుర్తి మార్కెట్లో క్వింటా ధర గరిష్ఠంగా ₹9,865, వనపర్తిలో ₹9,784, నారాయణపేటలో ₹9,500, APలోని ఆదోని మార్కెట్లో నిన్న ₹9,652 పలికింది. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా నూనె గింజలకు నెలకొన్న డిమాండే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కాగా గత ఏడాది క్వింటా ధర రూ.7వేల లోపే పలికింది.
News January 25, 2026
పద్మ భూషణ్ అవార్డులు వీరికే

ఈ ఏడాది కేంద్రం 13 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. జాబితాలో అల్క యాగ్నిక్(ఆర్ట్), భగత్ సింగ్ కోశ్యారి(పబ్లిక్ అఫైర్స్), కల్లిపట్టి రామస్వామి(మెడిసిన్), మమ్ముట్టి(ఆర్ట్), దత్తాత్రేయుడు(మెడిసిన్), పీయూష్ పాండే(ఆర్ట్), మైలానందన్(సోషల్ వర్క్), సత్యవర్ధని(ఆర్ట్), శిబూ సోరెన్, ఉదయ్ కోటక్(ఇండస్ట్రీ), VK మల్హోత్రా(పబ్లిక్ అఫైర్స్), వెల్లపల్లి నటేశన్(పబ్లిక్ అఫైర్స్), అమృత్ రాజ్(స్పోర్ట్స్).
News January 25, 2026
పద్మవిభూషణ్ అవార్డులు వీరికే

ఈ ఏడాది కేంద్రం ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. పద్మవిభూషణ్: అచ్యుతానందన్(కేరళ-పబ్లిక్ అఫైర్స్), కేటీ థామస్(కేరళ-పబ్లిక్ అఫైర్స్), ధర్మేంద్ర(MH-ఆర్ట్), ఎన్ రాజమ్(UP-ఆర్ట్), పి.నారాయణన్(కేరళ-లిటరేచర్, ఎడ్యుకేషన్). వీరిలో ధర్మేంద్ర, అచ్యుతానందన్కు మరణానంతరం అవార్డులు వరించాయి.


