News August 6, 2025
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేని వారితోనూ చాట్ చేయొచ్చు!

వాట్సాప్‌లో త్వరలో ‘గెస్ట్ చాట్’ పేరిట కొత్త ఫీచర్ రానుంది. దీని సాయంతో వాట్సాప్ అకౌంట్ లేని వారితో చాట్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు ఆ కాంటాక్ట్ నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్/ఈమెయిల్/ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇన్విటేషన్ లింక్ పంపాల్సి ఉంటుంది. అయితే ఈ చాట్ ద్వారా మీడియా ఫైల్స్ పంపేందుకు, ఆడియో/వీడియో కాల్స్ చేసేందుకు వీలుండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది.
Similar News
News August 6, 2025
వీరికి రేపు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

AP: చేనేత దినోత్సవం సందర్భంగా రేపు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ముగ్గురు ఏపీవాసులు అవార్డులందుకుంటారు. వెంకటగిరికి చెందిన జంఢాని చీరల తయారీలో కృషిచేసిన లక్క శ్రీనివాసులుకు ‘సంత్ కబీర్ హ్యాండ్లూం’ అవార్డు దక్కింది. మల్టీ డైమండ్ టై&డై సిల్క్ చీరలకు K.మురళి, డిజైన్ అభివృద్ధి చేసినందుకు J.నాగరాజుకు జాతీయ అవార్డులు దక్కాయి. మొత్తం ఐదుగురు సంత్ కబీర్, 19 మంది జాతీయ హ్యాండ్లూం అవార్డులకు ఎంపికయ్యారు.
News August 6, 2025
షూటింగ్‌లు బంద్.. బాలకృష్ణతో నిర్మాతల భేటీ

సినీ హీరో బాలకృష్ణతో నిర్మాతలు భేటీ అయ్యారు. ప్రసన్న, మైత్రి రవి, చెరుకూరు సుధాకర్, గోపీ ఆచంట, ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్, దామోదర్ ప్రసాద్ తదితరులు ఆయనతో సమావేశమయ్యారు. సినీ కార్మికుల బంద్‌పై చర్చిస్తున్నారు. కాగా వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో రెండు రోజులుగా సినీ కార్మికులు షూటింగ్‌ల బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో నిర్మాతల భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
News August 6, 2025
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ‘వార్-2’ ప్రీరిలీజ్ ఈవెంట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ‘వార్-2’ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈనెల 10న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ ప్రకటించారు. పర్మిషన్ రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అలాగే రేపు సినిమాలోని ‘సలామ్ అనాలి’ సాంగ్ ప్రోమో రానుందని తెలిపారు. అయితే ‘దేవర’ ఈవెంట్‌లా ఫెయిల్ చేయొద్దని, పకడ్బందీగా ప్లాన్ చేయాలని మేకర్స్‌కు ఫ్యాన్స్ సూచిస్తున్నారు.