News September 29, 2024

కొత్త ఫీచర్.. వాట్సాప్ స్టేటస్‌లో పోల్స్

image

వాట్సాప్ ‘పోల్స్ ఫర్ స్టేటస్ అప్ డేట్స్’ అనే ఫీచర్ తీసుకురానుంది. దీనితో యూజర్లు తమ స్టేటస్‌లలో పోల్స్ పెట్టవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చేందుకు వీలుంటుంది. ఎవరెవరు పోల్‌లో పాల్గొన్నారు? ఏ ఆప్షన్ ఎంచుకున్నారనేది ఇతరులకు కనిపించదు. పోల్ రిజల్ట్ మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Similar News

News December 6, 2025

దాతలు సమాజానికి నిజమైన స్ఫూర్తిప్రదాతలు: కలెక్టర్

image

విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు నిజమైన స్ఫూర్తిప్రదాతలు అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శనివారం జీజీహెచ్‌లో ఆల్ ఫ్రెస్కో యాంపీ థియేటర్ ఆమె ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో దాతలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తుందని తెలిపారు. జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 6, 2025

ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

News December 6, 2025

ఖలీ భూమిపై దుండగుల కన్ను.. ఏం చేశాడంటే?

image

ఒంటిచేత్తో నలుగురిని ఎత్తిపడేసే బలం ఉన్న WWE స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) నిస్సహాయత వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని పాంటా సాహిబ్‌లో కొందరు దుండగులు తన భూమిపైనే కన్నేశారని వాపోయారు. రెవెన్యూ అధికారుల అండతో వారు భూమిని ఆక్రమించడానికి యత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతటి బడా సెలబ్రిటీకే ఈ దుస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.