News July 25, 2024

గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్లు(1/2)

image

ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేందుకు గూగుల్ మ్యాప్స్ కొత్త AI ఫీచర్లను తీసుకురానుంది. ఇరుకైన రోడ్లు, ఫ్లై ఓవర్లు, సర్వీస్ స్టేషన్లను ఇవి నోటిఫై చేస్తాయని తెలిపింది. శాటిలైట్ చిత్రాలు, స్ట్రీట్ వ్యూ, ఇతర సమాచారం ద్వారా వీటిని రూపొందించినట్లు గూగుల్ మ్యాప్స్ GM డేనియల్ తెలిపారు. ఫోర్ వీలర్స్ ఇరుకుదారుల్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కొత్త ఫీచర్‌ చూపిస్తుందని తెలిపింది.

Similar News

News October 17, 2025

ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం లేదు: డిప్యూటీ కమిషనర్

image

ఉమ్మడి జిల్లాలో ఎటువంటి కల్తీ మద్యం లేదని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి అన్నారు. విజయనగరంలోని శుక్రవారం ఆయన మాట్లాడుతూ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో తమ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారని, ఎక్కడ కల్తీ మద్యం లేదని చెప్పారు. వైన్ షాపులు, బార్ షాపులను తనిఖీ చేశామన్నారు. ప్రజలకు సురక్షతమైన మద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు.

News October 17, 2025

నవంబర్ 11న సెలవు

image

TG: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ రోజున నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News October 17, 2025

తిరుమల శ్రీవారి జనవరి కోటా విడుదల తేదీలివే

image

2026 జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ, సుప్రభాతం, అర్చన టోకెన్ల కోసం ఈ నెల 19న 10am నుంచి 21న 10am వరకు <>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చని TTD ప్రకటించింది. 23న 10amకి ఆర్జిత సేవా టికెట్లు, అదే రోజున 3pmకి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు, 24న 11amకి శ్రీవాణి ట్రస్ట్ దాతల ఆన్‌లైన్ కోటా, 3pmకి వృద్ధులు, దివ్యాంగుల కోటా, 25న 10amకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు (₹300), 3pmకి గదుల కోటాను విడుదల చేయనుంది.