News July 25, 2024
గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్లు(2/2)

ప్రస్తుతం ఈ ఫీచర్లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌తో సహా 8 నగరాల్లోని ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే IOS యూజర్లతో పాటు అన్ని నగరాలకు విస్తరించనుంది. మరో ఫీచర్ ప్రయాణ మార్గంలో ఫ్లైఓవర్లను గుర్తించి ఏ మార్గంలో వెళ్లాలో సూచిస్తుంది. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సమాచారాన్ని అందించేలా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
Similar News
News January 18, 2026
శివం ఉపాధ్యాయకు ఎస్పీగా పదోన్నతి

ఐపీఎస్ అధికారి శివం ఉపాధ్యాయ పదోన్నతి పొందారు. అదనపు ఎస్పీ స్థాయి నుంచి ఎస్పీగా పదోన్నతి పొందిన ఆయనకు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం స్టార్స్ అలంకరించి (పిప్పింగ్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. శివం ఉపాధ్యాయ వృత్తిపరమైన నిబద్ధత, క్రమశిక్షణ అభినందనీయమన్నారు. కొత్త బాధ్యతల్లోనూ అదే అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.
News January 18, 2026
దావోస్‌కు బయలుదేరిన CM చంద్రబాబు

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు CM చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం దావోస్‌కు బయల్దేరింది. రేపు ఉదయం 11 గంటలకు జ్యూరిచ్‌కు చేరుకోనుంది. సాయంత్రం తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని, రోడ్డు మార్గాన దావోస్‌కు CBN వెళ్లనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో భేటీ కానున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ ఉన్నారు.
News January 18, 2026
తెలంగాణ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

* మెట్రో ఫేజ్ 2ఏ, ఫేజ్ 2బీ భూసేకరణకు సంబంధించి రూ.2,787 కోట్ల కేటాయింపునకు ఆమోద ముద్ర
* ములుగు జిల్లాలో సాగునీరు అందించేందుకు పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం
* 2027లో జులై 27- ఆగస్టు 3 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు బాసర-భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాల శాశ్వత అభివృద్ధి, ఎకో పార్కుల నిర్మాణానికి నిర్ణయం
* మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి నిర్ణయం


