News March 27, 2024
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు

వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఆధారిత ఇమేజ్ టూల్ అందుబాటులోకి రానుంది. దీని సాయంతో ఫొటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, స్టైల్, బ్యాక్ గ్రౌండ్ మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. అలాగే ‘ఆస్క్ మెటా’ అనే మరో ఫీచర్‌నూ వాట్సాప్ తీసుకురానుంది. యాప్‌లో సెర్చ్ బార్ ద్వారా మెటా ఏఐని ప్రశ్నలు అడిగి, అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఈ రెండు ఫీచర్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News March 21, 2026
కల్తీని అరికట్టేలా.. తిరుమలలో ఫుడ్ ల్యాబ్ రెడీ!

తిరుమలలో వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ సిద్ధమైంది. ₹25 కోట్ల వ్యయంతో నిర్మించిన ల్యాబ్‌ను ఇవాళ CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ప్రసాదాల్లో వినియోగించే ముడిసరకును ఇక్కడే తనిఖీ చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. సూక్ష్మస్థాయిలో కల్తీ జరిగినా గుర్తించేలా పరీక్షలు చేయనున్నారు. ఈ తరహా ఫుడ్ ల్యాబ్ ఓ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.
News March 21, 2026
గుడ్‌న్యూస్.. ఒకేసారి 3 నెలల రేషన్!

ఏప్రిల్, మే, జూన్ నెలల ఉచిత రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు రాష్ట్రాలకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులకు అధికారికంగా సమాచారం అందించే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఎండల తీవ్రత, గోదాముల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వర్షాకాలంలోనూ ఇలాగే పంపిణీ చేసింది.
News March 21, 2026
రోహిత్‌ను MI పూర్తిగా వాడుకోవాలి: ఇర్ఫాన్

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. ‘రోహిత్‌ను MI ఎలా యూజ్ చేసుకుంటుందనేది కీలకం. ఇంపాక్ట్ ప్లేయర్‌లా కాకుండా అతడు గ్రౌండ్‌లో ఉండటం చాలా ముఖ్యం. కెప్టెన్‌కు సాయపడగలడు. విజయవంతమైన సారథిని వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలి’ అని సూచించారు. గత IPLలో రోహిత్ భారీగా పరుగులు చేశారని, ఈసారి ఇంకా మెరుగ్గా ఆడతారని అన్నారు.


