News August 19, 2025

IAFకు కొత్త ఫైటర్ జెట్లు.. రూ.62,000 కోట్లతో ఒప్పందం!

image

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 97 LCA మార్క్ 1A ఫైటర్ జెట్ల తయారీ బాధ్యతలను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థకు కేంద్రం అప్పగించింది. ఇందుకోసం రూ.62,000 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో MiG-21s ఎయిర్‌క్రాఫ్ట్స్‌ల స్థానంలో వీటిని వాడనున్నారు. LCA మార్క్ 1A ఎయిర్‌క్రాఫ్ట్స్‌ల కోసం కేంద్రం ఆర్డర్ ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో రూ.48,000Crతో 83 ఫైటర్ జెట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.

Similar News

News April 6, 2026

ఇండస్ట్రీకి ఎక్కువ మంది అమ్మాయిలు రావాలి: సుప్రియ

image

సినీ పరిశ్రమకు ఎక్కువ మంది మహిళలు వస్తే అసమానతలు తొలగిపోతాయని డెకాయిట్ నిర్మాత, నటి సుప్రియ యార్లగడ్డ చెప్పుకొచ్చారు. తమ సినిమాకు ఎంతో మంది మహిళలు పనిచేశారన్నారు. తనకు సినీ నేపథ్యం ఉండటం అదృష్టంగా భావిస్తానని.. అది భరోసానిచ్చిందని చెప్పుకొచ్చారు. శేష్ గత సినిమాల కంటే ‘డెకాయిట్’ భిన్నమైనదని అన్నారు. కొవిడ్ తర్వాత ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందని, మంచి సినిమాలకు ఆదరణ దక్కుతోందన్నారు.

News April 6, 2026

భర్తతో వీడియో కాల్.. తమిళ నటి ఆత్మహత్య

image

తమిళ నటి సుభాషిణి(36) ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉంటున్న భర్తతో వీడియో కాల్‌లో వాగ్వాదం జరిగి క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నట్లు వెల్లడించారు. అపార్ట్‌మెంట్ సెక్యూరిటీని భర్త అలర్ట్ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. తమిళంలో ‘కాయల్’ సహా పలు సీరియళ్లలో ఆమె నటించారు.

News April 6, 2026

ప్రకాశ్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. నెట్టింట విమర్శలు

image

నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ‘స్థాపనా దివస్ సందర్భంగా.. హిందూ ధర్మం ముసుగులో ద్వేషాన్ని పెంచుతూ దేశ ఆర్థిక వ్యవస్థను, సామరస్యాన్ని దెబ్బతీసిన ఫేక్ ఫకీర్’ గుర్తుకు వచ్చారు’ అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన శిష్యులకు విద్వేషాన్ని నూరి పోస్తున్న ఆ వ్యక్తి ఎవరో ఊహించాలంటూ నెటిజన్లను కోరారు. PM మోదీని లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.