News January 22, 2025

‘ఉబర్’లో కొత్త మోసం!

image

ప్రముఖ రైడ్ షేరింగ్ యాప్ ‘ఉబర్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. మొబైల్ ఛార్జింగ్ పర్సంటేజ్‌ను బట్టి ట్రిప్ ఛార్జిని నిర్ణయిస్తున్నట్లు ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఫుల్ ఛార్జింగ్ నుంచి తక్కువ పర్సంటేజ్ గల నాలుగు మొబైల్స్‌లో ఒకే లొకేషన్‌కు ఉబర్‌లో బుకింగ్స్ చెక్ చేశారు. ఛార్జింగ్ తక్కువగా ఉన్న మొబైల్‌లో ఎక్కువ, ఫుల్ ఛార్జి ఉన్నదాంట్లో తక్కువ ధర చూపించింది. ఈ మోసాన్ని మీరెప్పుడైనా గమనించారా?

Similar News

News January 23, 2025

దొడ్డు బియ్యం అమ్ముకునేవారు.. మేం సన్నబియ్యం ఇస్తాం: మంత్రి

image

TG: గతంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు దొడ్డు బియ్యం ఇచ్చేవారని, తాము ప్రతి ఒక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యానికి ఏటా రూ.7వేల కోట్లు ఖర్చు చేసేదని, అయినా ఆ దొడ్డు బియ్యాన్ని ఎవరూ తినకపోయేవారని చెప్పారు. వాటిని లబ్ధిదారులు బయట అమ్ముకునేవారని పేర్కొన్నారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.

News January 23, 2025

నా ఎదుగుదలకు వారే కారణం: అభిషేక్ శర్మ

image

క్రికెటర్‌గా తన ఎదుగుదలకు యువరాజ్ సింగ్, లారా, వెటోరి తోడ్పడ్డారని, ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండగా నిలుస్తున్నారని అభిషేక్ శర్మ తెలిపారు. ఇంగ్లండ్‌తో తొలి టీ20 అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విఫలం అవుతాననే భయం లేకుండా సొంత శైలిలో ఆడమని కోచ్, కెప్టెన్ తనకు చెప్పారని పేర్కొన్నారు. అదే తనకు కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నారు. తొలి టీ20లో అభిషేక్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

News January 23, 2025

యుద్ధం ఆపాల్సిందే.. పుతిన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

image

ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించారు. లేదంటే భారీ ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా పన్నులు, టారిఫ్‌లు విధిస్తామని తెలిపారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఈ వార్ ప్రారంభమయ్యేదే కాదన్నారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని, ఇక నుంచి ఒక్క ప్రాణం కూడా పోయేందుకు వీల్లేదన్నారు.