News December 11, 2024
బాధ్యతలు స్వీకరించిన RBI కొత్త గవర్నర్

IAS అధికారి సంజయ్ మల్హోత్ర RBI 26వ గవర్నర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేళ్ల వరకు ఆయన సేవలందిస్తారు. ‘పీస్టైమ్ జనరల్’గా పేరున్న ఆయన భారత ఎకానమీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. జనవరిలో రెపోరేటును తగ్గిస్తారని తెలుస్తోంది. రెవెన్యూ సెక్రటరీగా ఆయనకు మంచి అనుభవం ఉంది. ట్యాక్సేషన్, ఎకానమీ అంశాలపై పట్టుంది.
Similar News
News September 19, 2025
దసరా స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు!

TG: దసరా <<17751389>>స్పెషల్ బస్సుల్లో<<>> సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27-30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు RTC గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది.
News September 19, 2025
ఈనెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్

AP: రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలు మూసేస్తామంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులిచ్చాయి. 16నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలివ్వలేక, కళాశాలలు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా.. దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.
News September 19, 2025
నేటి అసెంబ్లీ అప్డేట్స్

AP: నేడు ఉ.10 గం.కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గం.కు క్యాబినెట్ సమావేశమై సభలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలపనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను ప్రవేశపెట్టనున్నారు.