News September 22, 2025
అమల్లోకి కొత్త జీఎస్టీ.. తగ్గిన ధరలు

దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40% లిస్టులో చేర్చారు. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాలతో పాటు సుమారుగా 200కు పైగా వస్తువుల ధరలు తగ్గాయి. ఇక దసరా సీజన్ కూడా మొదలవ్వడంతో కంపెనీలు మరింత ధరలు తగ్గించే అవకాశముంది. దీంతో షోరూమ్స్‌లో కొనుగోలుదారులతో సందడి నెలకొననుంది.
Similar News
News January 15, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News January 15, 2026
సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.
News January 15, 2026
సంక్రాంతి రోజు ఇలా చేస్తే మంచిది!

పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని పండితుల మాట. ‘కొత్త దుస్తులు ధరించి సూర్యుడిని స్మరించుకోవాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయాలి. ఇష్టదైవానికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఉదయం సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణుడి వ్రతాలు చేస్తే పుణ్యఫలం దక్కి కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా శక్తిమేర దానం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది’ అని చెబుతున్నారు.


