News April 18, 2024
మాల్దీవుల ప్రెసిడెంట్‌కు కొత్త చిక్కులు
వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని భారత్‌తో సత్సంబంధాలు చెడగొట్టుకున్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 21న ఆ దేశ పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్న వేళ 2018లో ఆయన అవినీతికి పాల్పడ్డారన్న ఓ రిపోర్ట్ లీకైంది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఒత్తిడి చేస్తున్న ప్రతిపక్షాలు.. ముయిజ్జును గద్దె దింపాలని భావిస్తున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలను ముయిజ్జు తోసిపుచ్చారు.
Similar News
News November 18, 2024
APSRTCలో 2,064 ఖాళీలు: మంత్రి మండిపల్లి
APSRTCలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సంస్థలో 1,275 డ్రైవర్లు, 789 మంది కండక్టర్ల కొరత ఉందని తెలిపారు. ఉద్యోగులకు EHS ద్వారా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని బస్టాండులను ఆధునికీకరిస్తామని పేర్కొన్నారు. YCP హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో బస్టాండుల నిర్వహణ కష్టతరమైందని ఆరోపించారు.
News November 18, 2024
పట్నం బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కొడంగల్ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 25న విచారిస్తామని తెలిపింది. అటు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది.
News November 18, 2024
రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవంటూ హైకోర్టులో పిటిషన్
TG: రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై CJ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజలు రోడ్డు సమస్యలు తెలిపేలా మొబైల్ యాప్ రూపొందించి R&B, HMDA అధికారులు దాన్ని నిర్వహించాలని గతంలో ఆదేశించినట్లు హైకోర్టు అధికారులకు గుర్తు చేసింది. మరో నెలలో యాప్ అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. ఆపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది.