News August 8, 2025

ఆగస్టు 11న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు!

image

ఈ ఏడాది FEBలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు-2025ను కేంద్రం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని అప్డేట్ చేసి ఆగస్టు 11న కొత్త బిల్లు తీసుకురానున్నట్లు సమాచారం. 1961 IT చట్టం స్థానంలో కొత్త బిల్లు తేవాలని FEBలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని సెలక్ట్ కమిటీకి పంపగా కొన్ని మార్పులు సూచించింది. వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకొని అప్డేట్ బిల్లు తెస్తున్నట్లు సమాచారం.

Similar News

News August 9, 2025

TODAY HEADLINES

image

*పులివెందుల ZPTC గెలవాలి: CBN
*APవ్యాప్తంగా P4 కింద 10 లక్షల కుటుంబాల దత్తత: CS
*అట్టహాసంగా ప్రారంభమైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్
*మూసీ పునరుజ్జీవనమే వరదలకు శాశ్వత పరిష్కారం: రేవంత్
*ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే వారికి ఆధార్ ఆధారిత చెల్లింపులు: TG ప్రభుత్వం
*ఐదుగురు BRS ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: రామ్‌చందర్ రావు
*అనుమతి లేకుండా షూటింగ్‌లు చేయొద్దు: ఫిల్మ్ ఛాంబర్
*బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్

News August 9, 2025

P4లో వెనుకబడ్డ జిల్లాలు.. సీఎం అక్షింతలు తప్పవా?

image

AP: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. AUG 15 నాటికి 80% పేద కుటుంబాలకు సాయం అందించాలని CM చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. కాకినాడ, గుంటూరు జిల్లాలు 95% లక్ష్యాన్ని చేరుకోగా.. నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో కనీసం 50% కూడా మార్గదర్శులు దత్తత తీసుకోలేదు. ఈ జిల్లాల అధికారులకు CM చేతుల్లో అక్షింతలు తప్పవని చర్చ నడుస్తోంది.

News August 9, 2025

మీ నిద్రని ట్రాక్ చేస్తున్నారా?

image

స్లీప్ ట్రాకింగ్‌తో ఎన్నో ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘స్లీప్ ట్రాకింగ్‌తో మీ నిద్ర, శరీరం స్పందిస్తున్న తీరు తెలుస్తుంది. ఎంతసేపు నిద్రపోయారు, ఎంత క్వాలిటీ నిద్ర పోయారో తెలుసుకోవచ్చు. ఈ రికార్డ్స్‌‌తో చికిత్సలేని కొన్ని నిద్ర సమస్యలను ముందే గుర్తించవచ్చు. దాంతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’ అని సూచిస్తున్నారు. స్మార్ట్ వాచ్, హెల్త్ రింగ్, AI పరికరాలతో మీ నిద్రని ట్రాక్ చేసుకోవచ్చు.