News December 19, 2024
ఆయన ఆలోచనా పునాదుల మీదే నవ భారతం: కమల్ హాసన్

అంబేడ్కర్ ఆలోచనా పునాదుల మీదే నవ భారతం నిర్మితమవుతోందని కమల్ హాసన్ పేర్కొన్నారు. విదేశీ అణచివేత నుంచి దేశానికి గాంధీ విముక్తి కల్పించగా, సామాజిక అన్యాయాల నుంచి అంబేడ్కర్ విముక్తి కల్పించారన్నారు. స్వేచ్ఛా భారతావని కోసం అంబేడ్కర్ దార్శనికతతో పనిచేస్తున్న ప్రతి పౌరుడు ఆయన వారసత్వాన్ని హననం చేసే చర్యలను అంగీకరించబోరని అమిత్ షా వ్యాఖ్యలపై కమల్ పరోక్షంగా స్పందించారు.
Similar News
News January 31, 2026
వారంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు

AP: తిరుపతికి చెందిన బయ్యాల చాందిని వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆమె బుధవారం జుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు. 2 రోజుల క్రితం గ్రూప్-2లో జాబ్ వచ్చింది. తాజాగా శుక్రవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో DSP క్యాడర్ పోస్ట్‌కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి భాస్కర్ TTD రిసెప్షన్-1 డిప్యూటీ EOగా పని చేస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని చాందిని నిరూపించారు.
News January 31, 2026
విజయ్ కింగ్ కాదు.. ఓట్లు చీల్చుతారంతే: గోయల్

తమిళనాడు ఎన్నికల్లో తప్పకుండా <<19008396>>గెలుస్తామని<<>> TVK చీఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. విజయ్ కింగ్ కాదని, కేవలం ఓట్లను చీల్చుతారని విమర్శించారు. ఆ పార్టీతో BJP పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు. గతంలో ఎంతో మంది సినీ స్టార్లు పాలిటిక్స్‌లోకి వచ్చారని, కానీ విఫలమయ్యారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AIADMK కలిసే పోటీ చేస్తాయని తెలిపారు.
News January 31, 2026
Op Sindoor: 10 నిమిషాల్లో 40 కోట్ల సైబర్ దాడులు!

ఆపరేషన్ సిందూర్ సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(NSE) వెబ్‌సైట్‌పై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లు సంస్థ సీఈవో ఆశిశ్ కుమార్ చౌహాన్ తెలిపారు. కేవలం 10 నిమిషాల్లోనే 40 కోట్ల దాడులు చేశారని చెప్పారు. వెబ్‌సైట్‌ను షట్‌డౌన్ చేయించేందుకు హ్యాకర్లు ప్రయత్నించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. NSEపై సగటున రోజుకు 20 కోట్ల సైబర్ దాడులు జరుగుతున్నాయని, వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు.


