News February 13, 2025
లోక్సభ ముందుకు కొత్త IT బిల్లు

లోక్సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్సభను వాయిదా వేశారు.
Similar News
News November 28, 2025
ఖమ్మం పల్లెల్లో ఎన్నికల జ్వరం..!

ఖమ్మం జిల్లాలో ఎన్నికల నియమాలు అమల్లోకి రావడంతో, పల్లెల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? అన్న మాటలే మార్మోగుతున్నాయి. ప్రజలు గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, కుటుంబ బలం, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేసుకుంటూ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
News November 28, 2025
వైకుంఠ ద్వార దర్శనం: టికెట్లు ఇలా బుక్ చేయండి

TTD అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి మొదటి 3 రోజులకు (DEC 31, 31, JAN 1) టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాట్సప్ నంబర్ 9552300009కి HI లేదా GOVINDA అని మెసేజ్ చేసి, వివరాలు ఇవ్వడం ద్వారా కూడా టికెట్లు బుక్ అవుతాయి. ఒక నంబర్తో గరిష్ఠంగా నలుగురికి బుక్ చేసుకోవచ్చు. DEC 1 వరకు ఛాన్సుంది. ఆ తర్వాత టికెట్లను లక్కీ డిప్ తీస్తారు. ఎంపికైన వారికి మొదటి 3 రోజుల్లో ఉచిత దర్శన భాగ్యం దక్కుతుంది.
News November 28, 2025
మరోసారి మెగా పీటీఎం

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎంలో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.


