News June 27, 2024
జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. జీరో FIR ప్రకారం ఏ వ్యక్తి అయినా PS పరిధితో సంబంధం లేకుండా ఏ PSలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాలి.
Similar News
News January 18, 2026
APలో 259కి పెరిగిన IAS క్యాడర్ బలం

APలో IASల కోటా పెరిగింది. రాష్ట్రంలో క్యాడర్ బలాన్ని కేంద్రం 239 నుంచి 259కి పెంచింది. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ మార్పు జరిగింది. ముఖ్యంగా జిల్లాల సంఖ్య పెరగడంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల పోస్టులను 13 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీనియర్ డ్యూటీ పోస్టులు కూడా 141కి చేరాయి. కొన్ని విభాగాల్లో డైరెక్టర్ పోస్టులు తగ్గించినప్పటికీ, ఓవరాల్‌గా అడ్మినిస్ట్రేషన్ బలోపేతం కానుంది.
News January 18, 2026
వాహనంలో పశువుల తరలింపు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

ఎండ కాస్తున్న సమయంలో, బాగా చల్లని సమయాల్లో, భారీ వర్షంలో జీవాలను రవాణా చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాత్రివేళలో మాత్రమే జీవాలను తరలించాలి. ఈ నిబంధన రోడ్డు మార్గంలో పశువుల తరలింపునకే వర్తిస్తుంది. పశువులను తీసుకెళ్లే వాహనం స్పీడ్ గంటకి 40 కిలోమీటర్లు మించకుండా చూసుకోవాలి. స్పీడ్ బ్రేకర్లు, మలుపుల వద్ద నెమ్మదిగా వెళ్లాలి.
News January 18, 2026
అల్కరాజ్ బోణీనా.. జకోవిచ్ 25వ ట్రోఫీనా!

టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఓ వైపు స్పానిష్ సంచలనం అల్కరాజ్ AUSలో బోణీ కొట్టాలని సిద్ధమయ్యారు. మరోవైపు తనకు కలిసొచ్చిన ఓపెన్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని జకోవిచ్ చూస్తున్నారు. అటు ఇటలీకి చెందిన వరల్డ్ నం.1 సిన్నర్ హ్యాట్రిక్ టైటిల్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఉమెన్స్‌లో స్టార్ ప్లేయర్స్ సబలెంకా, స్వియాటెక్ టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు.


