News June 29, 2024
‘కల్కి’తో న్యూ లెవెల్ అన్‌లాక్: విజయ్ దేవరకొండ

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ మూవీతో ఇండియన్ సినిమా న్యూ లెవెల్ అన్‌లాక్ అయిందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ఇంతకుముందే సినిమా చూశానని, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని ట్వీట్ చేశారు. ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని ఆకాంక్షించారు. కాగా ఈ చిత్రంలో విజయ్ అర్జునుడి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 9, 2026
జపాన్ ప్రధాని తకైచిని అభినందించిన మోదీ

జపాన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో విజయం సాధించిన ఆ దేశ ప్రధాని సనే తకైచిని PM నరేంద్ర మోదీ అభినందించారు. ఆమె సమర్థవంతమైన లీడర్‌షిప్‌లో ఇరుదేశాల స్నేహబంధం మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నట్టు SMలో పోస్ట్ పెట్టారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడంలో ఇండియా, జపాన్‌ల స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ కీలకపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 9, 2026
ఐర్లాండ్‌పై శ్రీలంక విజయం

T20WCలో ఐర్లాండ్‌పై శ్రీలంక 20 రన్స్ తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించిన ఐర్లాండ్.. బ్యాటింగ్‌లో మాత్రం తేలిపోయింది. టెక్టర్(40), అడైర్(34), లార్కన్(21) మాత్రమే రాణించారు. ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కొంతసేపు ఐర్లాండ్ డామినేషన్ కనిపించినా ఆఖరికి ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ చెరో 3, పతిరాణా 2, వెల్లలాగే, చమీర చెరో వికెట్ తీశారు.
News February 9, 2026
Jr.NTR న్యూ లుక్.. ఫ్యాన్స్ హ్యాపీ

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR నటిస్తున్న సినిమా షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ జోర్డాన్‌లో జరగనుంది. ఇందుకోసం ఈరోజు ఎన్టీఆర్ HYD నుంచి జోర్డాన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో తీసిన ఫొటోలు, వీడియోలు వైరలవుతున్నాయి. కొన్ని నెలల క్రితం తారక్ సన్నబడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ తాజా లుక్ చూసి ఖుషీ అవుతున్నారు. ఆయన బర్త్‌డే సందర్భంగా మే 20న గ్లింప్స్ లేదా టీజర్ రిలీజయ్యే ఛాన్సుంది.


