News July 31, 2024
OCT 1 నాటికి నూతన లిక్కర్ పాలసీ

AP: రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇవాళ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో పాలసీపై చర్చించనున్నారు. ప్రస్తుత మద్యం విధానం సెప్టెంబర్ నెలాఖరులోగా ముగుస్తుంది. దీంతో అక్టోబర్ 1 నాటికి కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేలా అధికారులు సమాయత్తమవుతున్నారు.
Similar News
News December 6, 2025
40 ఏళ్లు వచ్చాయా? ఈ అలవాట్లు మానేస్తే బెటర్

40 ఏళ్లు దాటిన తర్వాత ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరానికి సరిపడవు. చిప్స్, కేక్స్, కుకీస్ రక్తంలో చక్కెర స్థాయులను పెంచుతాయి. ఒత్తిడితో కార్టిసాల్ విడుదలై హై బీపీ, షుగర్, మెమొరీ లాస్‌కు కారణమవుతుంది. స్క్రీన్ ఎక్కువ చూస్తే గుండె జబ్బులు, మధుమేహ సమస్యల ప్రమాదం ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా బ్లడ్, థైరాయిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 6, 2025
‘RO-KO’ని దాటేసిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025లో మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్‌లో టాప్ ప్లేస్ సాధించారు. ఐపీఎల్‌తో ఈ యంగ్‌స్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. రెండో స్థానంలో ప్రియాన్ష్ ఆర్య, మూడో స్థానంలో అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నాలుగో స్థానం, జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచారు. IPL 2025, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బజ్ ఉన్నా రోహిత్, కోహ్లీ ఈ లిస్టులో పేర్లు సాధించలేకపోయారు.
News December 6, 2025
‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్లైన్ కంటెంట్ రూల్స్‌ను మస్క్ ప్లాట్‌ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.


