News August 7, 2024
అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ.. అందుబాటు ధరల్లో మద్యం

AP:అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది. TG, తమిళనాడు, కర్ణాటక నుంచి నాన్ డ్యూటీ లిక్కర్ అక్రమంగా APలోకి రావడంతో ఖజానాకు రూ.18వేల కోట్లు నష్టం వచ్చినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ‘నాణ్యత లేని మద్యం అమ్మకాలతో గత ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడింది. వారి వ్యసనాన్ని ఆసరాగా తీసుకుంది. ప్రజలకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపడతాం’ అని చెప్పారు.
Similar News
News November 21, 2025
‘వస్త్ర పరిశ్రమ సాధికారత.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక’

ఇందిరా మహిళ చీరల ఉత్పత్తి ఆర్డర్లతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సాధికారతకు ఉపయోగపడుతుందని, మహిళల ఆత్మగౌరవానికి తోడ్పడుతుందని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలకు అందజేసే చీరలు జిల్లాలో ఉత్పత్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని, 32 జిల్లాల నుంచి SHGల బాధ్యులు వచ్చి చీరల తయారీ విధానం, దశలు, రంగులు, నాణ్యతను చూసి ఆనందం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.


