News August 2, 2024
అక్టోబర్ 1 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం!

APలో నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజస్థాన్, యూపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎక్సైజ్ పాలసీలపై అధ్యయనానికి అధికారుల బృందాలను పంపనుంది. అక్కడి బార్లు, మద్యం ధరలు, కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్ పేమెంట్ అంశాలపై ప్రభుత్వానికి ఈ నెల 12లోగా అధికారులు నివేదికలు ఇవ్వనున్నారు. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం తెచ్చేలా GOVT ప్రణాళికలు రచిస్తోంది.
Similar News
News December 29, 2025
మాంజా వేలాడుతోంది.. జాగ్రత్త!

చైనా మాంజా యమపాశంగా మారుతోంది. సంక్రాంతి సమీపిస్తుండటంతో ఇప్పటినుంచే పిల్లలు, పెద్దలు పోటాపోటీగా గాలిపటాలు ఎగురవేస్తున్నారు. దీంతో తెగిపోయిన వాటికున్న మాంజా భవనాల మధ్యలో వేలాడుతోంది. ఇది గమనించకుండా దూసుకెళ్లడంతో బైకర్లు గాయపడుతున్నారు. అందుకే బైక్‌పై వెళ్లేటప్పుడు మెడకు కర్చీఫ్ కట్టుకోవడం, ఫుల్ హెల్మెట్ ధరించడం మేలు. బైకర్లు అప్రమత్తంగా ఉండాలి. మాంజా వాడకపోవడం మంచిది.
News December 29, 2025
మంత్రులు, MLAలు సిద్ధంగా ఉండాలి: CM

TG: నీళ్ల సెంటిమెంట్‌తో BRS తమపై అటాక్ చేయాలని చూస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులతో భేటీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతిపక్ష నేతల విమర్శలు, ఆరోపణలను సమర్థంగా తిప్పి కొట్టాలి. JAN 1న సాయంత్రం 4 గం.కు ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన నదీ జలాలు, నీటి వాటాలపై జరిగిన తప్పిదాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలి’ అని తెలిపారు.
News December 29, 2025
పోలీసులు చెబితే నేరం చేసినట్టా: ఐబొమ్మ రవి

TG: బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలు ఉన్నాయని తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఇమంది రవి చెప్పారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘నా పేరు ఐబొమ్మ రవి కాదు. ఇమంది రవి. పోలీసులు చెబితే నేరం చేసినట్టా. నేను ఎక్కడికీ పారిపోలేదు. కూకట్‌పల్లిలోనే ఉన్నాను. వేరే దేశంలో సిటిజన్‌షిప్ మాత్రమే తీసుకున్నాను. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతా. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను’ అని అన్నారు.


