News October 14, 2024
న్యూ లిక్కర్ పాలసీ.. ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం

AP: మద్యం షాపులకు ఇవాళ జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.
Similar News
News October 13, 2025
యథాతథంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె

AP: ఈనెల 15 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె యథాతథంగా జరగనున్నట్లు విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల జేఏసీతో యాజమాన్యాల చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకు పోరాటం ఆపేదే లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
News October 13, 2025
గుండెపోటుతో కమెడియన్ మృతి

కన్నడ కమెడియన్, బిగ్బాస్-7 కంటెస్టెంట్ రాజు తాలికొటే మరణించారు. నిన్న అర్ధరాత్రి గుండెపోటుకు గురైన ఆయనను కర్ణాటకలోని ఉడుపి మణిపాల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనసారె, పంచరంగి, లైఫ్ ఈజ్ దట్, రాజ్ధాని, మైనా, టోపీవాలా వంటి చిత్రాల్లో ఆయన నటించారు. BB-7లో పాల్గొనడంతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ సందడి చేశారు. రాజు మృతి పట్ల కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ సంతాపం తెలిపారు.
News October 13, 2025
నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్ సవాల్

AP: నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> మరోసారి స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టు కథ అని ఆరోపించారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు, లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రమాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జనార్ధన్తో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, బలవంతంగా అతనితో తన పేరు చెప్పించారని మండిపడ్డారు.